విజ‌య‌వాడ‌ గ్యాంగ్‌ వార్.. తోట సందీప్ మృతి

|

May 31, 2020 | 9:39 PM

విజయవాడలో శ‌నివారం జరిగిన గ్యాంగ్ వార్‌ క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. మొద‌ట ఇది స్టూడెంట్స్ మ‌ధ్య విబేధాల వ‌ల్ల త‌లెత్తెన గొడ‌వ అనుకున్నా..త‌ర్వాత రూ.2 కోట్ల విలువైన ఓ ల్యాండ్ వ్య‌వ‌హారినికి సంబంధించిన ఘ‌ర్ష‌ణ‌గా తెలిసింది. ఈ పరస్పర దాడుల్లో ఓ గ్రూపుకు నాయ‌క‌త్వం వ‌హిస్తోన్న‌ తోట సందీప్ తీవ్ర గాయాల‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించారు. యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో విష‌యంలో తోట సందీప్‌, మణికంఠ వర్గాలు..జోక్యం చేసుకోవడంతో వివాదం […]

విజ‌య‌వాడ‌ గ్యాంగ్‌ వార్.. తోట సందీప్ మృతి
Follow us on

విజయవాడలో శ‌నివారం జరిగిన గ్యాంగ్ వార్‌ క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. మొద‌ట ఇది స్టూడెంట్స్ మ‌ధ్య విబేధాల వ‌ల్ల త‌లెత్తెన గొడ‌వ అనుకున్నా..త‌ర్వాత రూ.2 కోట్ల విలువైన ఓ ల్యాండ్ వ్య‌వ‌హారినికి సంబంధించిన ఘ‌ర్ష‌ణ‌గా తెలిసింది. ఈ పరస్పర దాడుల్లో ఓ గ్రూపుకు నాయ‌క‌త్వం వ‌హిస్తోన్న‌ తోట సందీప్ తీవ్ర గాయాల‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించారు.

యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో విష‌యంలో తోట సందీప్‌, మణికంఠ వర్గాలు..జోక్యం చేసుకోవడంతో వివాదం తలెత్తింది. ఈ విష‌యంలో ఇరు వ‌ర్గాలు వెన‌క్కి త‌గ్గేందుకు ఇష్టప‌డ‌లేదు. ఎంత‌దూర‌మైన వెళ్లాల‌ని డిసైడ‌యిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. రాజీ పేరుతో రెండు గ్యాంగులు ఒక చోట చేరుకుని.. ప్లాన్‌తోనే కత్తులు, రాడ్డుల‌తో స్పాటుకు వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. అక్క‌డ ఇరు వ‌ర్ఘాలు ఘ‌ర్ణ‌ణ‌కు దిగాయి. దీంతో తోట‌ సందీప్, మరొకరు తీవ్రంగా గాయపడగా వారిని ప్రవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో సందీప్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ దాడులకు పాల్ప‌డ్డ‌వారిపై సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారు. కేసును సీరియ‌స్ గా తీసుకున్న పోలీసులు.. దాడుల్లో పాల్పడ్డ వారి వివరాలను సేకరిస్తున్నారు.