100% మ్యాచ్ ఫిక్సింగే: విజయసాయి ట్వీట్

|

Jun 22, 2019 | 5:27 PM

వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ విమర్శలు చేసారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే ఈ నలుగుర్నీ బీజేపీకి పంపించారని ఆరోపించారు. మోదీ గూటికి చేరిన నలుగురు ఎంపీలు  చంద్రబాబు బినామీలేనన్నారు. వీరంతా పార్టీ మారినట్టు బాబుకు […]

100% మ్యాచ్ ఫిక్సింగే:  విజయసాయి ట్వీట్
Follow us on

వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ విమర్శలు చేసారు.

ట్విట్టర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే ఈ నలుగుర్నీ బీజేపీకి పంపించారని ఆరోపించారు. మోదీ గూటికి చేరిన నలుగురు ఎంపీలు  చంద్రబాబు బినామీలేనన్నారు.

వీరంతా పార్టీ మారినట్టు బాబుకు తెలియకపోతే  వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ  రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాసి ఉండేవారని విమర్శించారు.  నలుగురు పార్టీ మారడం  నూటికి నూరుశాతం మ్యాచ్ ఫిక్సింగే అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.