దేవరకొండ మనసు మార్చుకున్నాడా..?

ఈ మధ్యకాలంలో హీరోలందరూ కూడా ప్యాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఆ లిస్టులోకి తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఫైటర్’ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఇక అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు క్రాంతి మాధవ్ […]

దేవరకొండ మనసు మార్చుకున్నాడా..?

Edited By:

Updated on: Jan 08, 2020 | 7:17 PM

ఈ మధ్యకాలంలో హీరోలందరూ కూడా ప్యాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఆ లిస్టులోకి తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఫైటర్’ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది.

ఇక అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందించిన ఈ మూవీ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. కాగా, ఈ సినిమాకు విజయ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాత కె.ఎస్. రామారావు ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ మూవీ బాలీవుడ్ ఆడియన్స్‌కు కనెక్ట్ కాదని.. తెలుగులో మాత్రమే విడుదల చేయాలని నిర్మాతకు రౌడీ సూచించినట్లు సమాచారం. మరి విజయ్ డెసిషన్‌పై దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తారా లేదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.