భయపడుతున్న రౌడీ హీరో అభిమానులు..ఆ సెంటిమెంట్‌ను కాస్త పరిగణలోకి తీసుకోవాలని వేడుకోలు

వరల్డ్ ఫేమస్‌ లవర్‌ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న విజయ్‌ దేవరకొండ... పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఫైటర్ సినిమాను స్టార్ట్ చేశారు. అయితే కోవిడ్‌ కారణంగా ఆ షార్ట్‌ గ్యాప్‌ కాస్త లాంగ్‌ గ్యాప్ అయ్యింది.

భయపడుతున్న రౌడీ హీరో అభిమానులు..ఆ సెంటిమెంట్‌ను కాస్త పరిగణలోకి తీసుకోవాలని వేడుకోలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2020 | 9:54 PM

వరల్డ్ ఫేమస్‌ లవర్‌ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న విజయ్‌ దేవరకొండ… పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఫైటర్ సినిమాను స్టార్ట్ చేశారు. అయితే కోవిడ్‌ కారణంగా ఆ షార్ట్‌ గ్యాప్‌ కాస్త లాంగ్‌ గ్యాప్ అయ్యింది. లాక్‌ డౌన్‌ ఎత్తేసినా ఫైటర్‌ మాత్రం ఇంకా సెట్‌కు రాలేదు. త్వరలోనే షూటింగ్ రీస్టార్ట్‌ చేస్తారన్న టాక్ వినిపిస్తున్నా… ఎప్పుడన్నది పక్కాగా తెలియదు. ఈ టైంలోనే మరో అప్‌డేట్‌ రౌడీ ఫ్యాన్స్‌ను భయపెడుతోంది.

తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కు తండ్రిగా యాక్షన్‌ కింగ్ అర్జున్ నటిస్తున్నారన్నది నయా అప్‌డేట్‌. అయితే ఈ వార్తతోనే రౌడీ ఫ్యాన్స్‌లో గుబులు మొదలైంది. మల్టీ లింగ్యువల్ హీరోగా అర్జున్‌కు మంచి క్రేజ్‌ ఉన్నా.. టాలీవుడ్ లో మాత్రం క్యారక్టర్‌ ఆర్టిస్ట్ గా ఆయన రికార్డ్ చాలా బ్యాడ్‌ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అప్పుడెప్పడో రిలీజ్‌ అయిన శ్రీఆంజనేయం దగ్గర నుంచి అర్జున్‌ నటించిన తెలుగు సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. లై, నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా లాంటి సినిమాలకు కూడా నెగెటివ్‌ రిజల్టే వచ్చింది. ఈ సెంటిమెంటే రౌడీ ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. అసలే హిట్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న విజయ్‌కి అర్జున్ సెంటిమెంట్‌ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని కలవర పడుతున్నారు ఫ్యాన్స్.

అయితే టాలీవుడ్‌ లో ఫ్లాప్స్ వచ్చినా.. ఇతర భాషల్లో మాత్రం అర్జున్‌ రికార్డ్‌ సూపర్బ్‌గా ఉంది. తమిళ, మలయాళ, కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న అర్జున్‌… క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బ్లాక్‌ బస్టర్ హిట్స్ సాధిస్తున్నారు. ఫైటర్ కూడా పాన్ ఇండియా సినిమా కావటంతో అర్జున్‌ టాలీవుడ్‌ రికార్డ్‌ను పెద్దగా పట్టించుకోవటం లేదు మేకర్స్‌. మరి ఫైటర్‌ మీద అర్జున్‌ సెంటిమెంట్‌ ఎలా పనిచేస్తుందో చూడాలి.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే