‘బిచ్చగాడు 2’ టైటిల్ లోగో విడుదల..

తమిళ హీరో విజయ్ అంటోనీ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'బిచ్చగాడు'. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

బిచ్చగాడు 2 టైటిల్ లోగో విడుదల..

Updated on: Jul 24, 2020 | 4:07 PM

Bichagadu 2 Official Title Logo: తమిళ హీరో విజయ్ అంటోనీ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘బిచ్చగాడు’. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. అటు తమిళ, ఇటు తెలుగు భాషల్లో విజయ్ అంటోనీకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇవాళ విజయ్ అంటోనీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ‘బిచ్చగాడు 2’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రియ కృష్ణస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. హీరో విజయ్ అంటోనీ తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరి ఈ ‘బిచ్చగాడు 2’ ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.