
Pope Francis ‘Likes’ : ఒక్కోసారి కొన్ని తెలిసి చేసినా.. తెలియక చేసిన పొరపాట్లు పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. ఇది సామాన్యుల నుంచి పెద్ద స్థాయి వ్యక్తులను ఇరకటంలోకి నెట్టేస్తుంటాయి. ఇక సామాన్యులు చేస్తే పెద్దగా నష్టం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవచ్చు.. అయితే పెద్ద స్థాయి వ్యక్తులు అదే తరహా పొరపాట్లు చేస్తే ఇంకేముంది అంతే.. అందులోనూ ఓ మతగురు చేస్తే ఇంకేమైనా ఉందా.. పెద్ద రచ్చే..
అందులోనూ మత గురువులు… పీఠాధిపతులు అన్నింటికీ అతీతంగా ఉండాల్సిన వ్యక్తులు ఐహిక బంధాలకు దూరంగా ఉంటుంటారు. వారు చేసే ప్రతి పని ఆదర్శవంతంగా ఉంటుందని ఆయనను అనుసరించేవారు కోరుకుంటుంటారు. వారి ప్రతి పనీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అందులో చిన్న పొరపాటు జరిగిందంటే ఇంకేమైనా ఉందా.. అంతే…! అలా కాదని హద్దు దాటితే ఇదిగో ఇలానే విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. సరిగ్గా అటువంటి చిక్కుల్లోనే పడ్డారు పోప్ ఫ్రాన్సిస్.
తాజాగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు పోప్ ఫ్రాన్సిస్. ‘మీకిది తగునా.. దీనికి మీ సమాధానం ఏంటి’ అని సామాన్యులు పోప్ ఫ్రాన్సిస్ ప్రశ్నిస్తున్నారు. ఇక నెట్టింట్లో అయితే నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత ఆగ్రహం దేనికి అంటే పోప్ తన ఇన్‌స్టాగ్రామ్ అధికారక అకౌంట్ నుంచి.. ఓ బికినీ ధరించిన ఓ బ్రేజిలియన్ మోడల్ ఫోటోని లైక్ చేశారు.
దీంతో ఈ విమర్శలు… వివరాలు… మోడల్ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్ లాకర్ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నేను మీకు ఒకటి, రెండు విషయాలు నేర్పించగలను’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోకి 1.5 మిలియన్లకి పైగా లైక్స్ వచ్చాయి.
ఈ ఫోటోని పోప్ ఫ్రాన్సిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ నెల 13న ‘లైక్’ చేసినట్లు ఉంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అనుహ్యంగా మరుసటి రోజే ‘డిస్‌లైక్’ అని కనిపించింది. దీంతో ఇది కాస్త గందరగోళంగా మారింది.
ఈ లోపు నటాలియా మానేజ్‌మెంట్ కంపెనీ సీఓవై.కో ఈ విషయాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవాలని ప్లాన్ చేసింది. అంతే.. పోప్ ఫ్రాన్సిస్ లైక్ చేసిన స్క్రీన్ షాట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ‘సీఓవై.కోకి పోప్ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్ క్వీన్ నటాలియాకు ధన్యవాదాలు’ అంటూ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.
అది కాస్తా ముదరడంతో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్ ఫోటోని లైక్ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. వాటికన్ ప్రతినిధి గార్డియన్‌తో మాట్లాడుతూ, “హోలీ సీ నుంచి” లైక్ “వచ్చిందని భావిస్తున్నాం. వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్‌స్టాగ్రామ్‌ని కోరాం” అని తెలిపారు.