‘గ్యాంగ్ లీడర్’ కోసం.. ‘వాల్మీకి’ త్యాగం

'గ్యాంగ్ లీడర్' కోసం.. 'వాల్మీకి' త్యాగం

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజైతే.. ఓపెనింగ్ కలెక్షన్స్‌పై ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా‌కు లాంగ్ రన్ ఉంటుంది. ఇక నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిన సినిమాకు వసూళ్లు తగ్గిపోతుంటాయి. అందుకే టాలీవుడ్ హీరోలందరూ తమ సినిమాలు ఒకే రోజు క్లాష్ కాకుండా చూసుకుంటారు. నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Aug 28, 2019 | 8:46 PM

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజైతే.. ఓపెనింగ్ కలెక్షన్స్‌పై ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా‌కు లాంగ్ రన్ ఉంటుంది. ఇక నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిన సినిమాకు వసూళ్లు తగ్గిపోతుంటాయి. అందుకే టాలీవుడ్ హీరోలందరూ తమ సినిమాలు ఒకే రోజు క్లాష్ కాకుండా చూసుకుంటారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ని కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం కరెక్ట్ కాదని.. నేచురల్ స్టార్ కోసం వాల్మీకి దారిచ్చాడు.

తాజా సమాచారం ప్రకారం ‘వాల్మీకి’ చిత్రం వారం వాయిదా పడి సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో తమిళ హీరో అథర్వ మురళీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్‌లో కనిపించనున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu