Varun Tej Joined In Shoot: ఇటీవల కరోనా మహమ్మారి మెగా కుటుంబంలో ఒక్కసారిగా అలజడి సృష్టించింది. క్రిస్మస్ వేడుకల తర్వాత మెగా ఫ్యామిలీలో ఒకేసారి రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ ఇద్దరు హీరోలు వెంటనే క్వారంటైన్‌కు వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా చికిత్స తీసుకున్న వరుణ్ తేజ్ మళ్లీ సెట్స్‌పైకి వచ్చాడు. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ‘ఎఫ్3’ చిత్ర షూటింగ్ స్పాట్‌లో సందడి చేశాడు. ఈ క్రమంలోనే సెట్స్‌లో వరుణ్‌తో కలిసిన దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ‘వెల్ కమ్ టు సెట్స్ వరుణ్ బ్రో.. సినిమా సెట్‌లో మళ్లీ ఫన్ మొదలైంది’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఇక ఇదే ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వరుణ్ తేజ్… ‘అనిల్ బ్రో… మొదటి రోజు షూటింగ్ అద్భుతంగా జరిగింది. రేపు కలుద్దాం’ అంటూ రీట్వీట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ‘ఎఫ్3’ సినిమాను దిల్‌రాజు ఏకంగా రూ.80 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘ఎఫ్2’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Anil broooo!
Had an awesome first day at shoot.
????
See you tomorrow!#F3movie https://t.co/6eykLDYAmd— Varun Tej Konidela ? (@IAmVarunTej) January 11, 2021
Also Read: Preity Zinta: నా కుటుంబం సేఫ్.. కరోనాను తేలికగా తీసుకోవద్దు.. రాత్రికి రాత్రి ఏదైనా జరగొచ్చు.