
సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ దఫా అభిమానులకు మరింత ఖుషీని ఇచ్చేలా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి అదరగొట్టే అప్‌డేట్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మోషన్ టీజర్ రిలీజ్ పవన్ బర్త్ డే నాడు రిలీజ్ కానుంది. రెండేళ్ల విరామం తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. తాజా విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ అప్పుడే ఆన్ లైన్లో ట్రెండ్ చేస్తూ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా తమన్ సంగీతమందిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పింక్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది.