
ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో సంయుక్త్ వికాస్ పార్టీ అభ్యర్థి వైద్యరాజ్ కిషన్ వెరైటీగా నామినేషన్ వేశారు. గుర్రంపై ఊరేగింపుగా.. పెళ్లి కొడుకు వేషంలో వైద్యరాజ్ కిషన్ నామినేషన్ వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయాలను తాను పెళ్లాడతానని, అందుకే ఇలా పెళ్లి కొడుకు వేషంలో, బ్యాండ్‌భాజాతో నామినేషన్ వేసినట్టు వైద్య రాజ్ కిషన్ చెప్పాడు. రాష్ట్రపతి ఎన్నికల నుంచి సర్పంచ్ పదవి వరకు తాను పోటీ చేసినట్టు తెలిపారు.