అంబేద్కర్ ఏమైనా దేశ ద్రోహా..? చెప్పండి కేసీఆర్..

పంజాగుట్ట చౌరస్తాలో కూల్చివేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పునప్రతిష్టించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు, కేసీఆర్ సీఎం కావడానికి కూడా అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగమే కారణమని గుర్తుచేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే రాష్ట్ర విభజన జరిగి ఉండేదా? అని ఆయన ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని లాకప్‌లో పెట్టడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్‌కి […]

అంబేద్కర్ ఏమైనా దేశ ద్రోహా..? చెప్పండి కేసీఆర్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2019 | 2:53 PM

పంజాగుట్ట చౌరస్తాలో కూల్చివేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పునప్రతిష్టించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు, కేసీఆర్ సీఎం కావడానికి కూడా అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగమే కారణమని గుర్తుచేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే రాష్ట్ర విభజన జరిగి ఉండేదా? అని ఆయన ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని లాకప్‌లో పెట్టడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్‌కి జరిగిన అవమానం పై పార్లమెంట్ సభ్యులు స్పందించాలని.. ఈనెల 11న ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిరాహార దీక్ష చేయబోతున్నానని హనుమంతరావు తెలిపారు. అంబేద్కర్ ఏమైనా దేశ ద్రోహా..? లాకప్‌లో ఎందుకు పెట్టారని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్‌లోని దళిత నేతలు మాట్లాడకపోవడం దారుణమన్నారు.