
using banned won’t be penalised: అప్పట్లో భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, చైనాకు చెందిన యాప్‌లు భారతీయుల వ్యక్తిగత సమచారాన్ని సేకరిస్తున్నాయన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీటిలో టిక్‌టాక్, పబ్జి వంటి ఎన్నో ప్రముఖ యాప్‌లు ఉన్నాయి. కొన్ని యాప్‌లనైతే చైనీయులు కంటే భారతీయులే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అయితే ప్రభుత్వం యాప్‌లను నిషేధించినప్పటికీ.. కొంతమంది మాత్రం సదరు యాప్‌లను ఉపయోగించుకునే క్రమంలో ఇతర ఏపీకే లింకుల ద్వారా వాటిని స్మార్ట్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకొని వాడుతున్నారు. అయితే చట్టవిరుద్ధంగా ప్రభుత్వం నిషేధించిన యాప్‌లను ఉపయోగించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఇలాంటి సందేహం వచ్చిన కొందరు ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని కోరారు. దీనికి స్పందించిన కేంద్రం.. నిషేధించిన యాప్‌లను ఉపయోగిస్తున్న వ్యక్తులపై ఎలాంటి జరిమానా, శిక్షలు విధించడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఐటి చట్టంలోని సెక్షన్ 69ఎ ప్రకారం మాత్రం.. నిబంధనలను పాటించని సంస్థలపై జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
Also read: International Flights Ban: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమానాలపై జనవరి 31 వరకు నిషేధం..