చైనా విమానాలకు.. అమెరికాలో నో ఎంట్రీ..!

| Edited By:

Jun 04, 2020 | 12:11 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. కరోనా విషయంలో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా ఆ దేశంపై ఆంక్షలు విధించింది. చైనాకు చెందిన నాలుగు విమానయాన

చైనా విమానాలకు.. అమెరికాలో నో ఎంట్రీ..!
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. కరోనా విషయంలో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా ఆ దేశంపై ఆంక్షలు విధించింది. చైనాకు చెందిన నాలుగు విమానయాన సంస్థల రాకపోకలను తమ దేశంలో నిషేదించింది. ఈ నెల 16 నుంచి ఇది అమల్లోకి రానుంది. పలు అమెరికా విమానాలకు చైనా అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. అమెరికా కూడా చైనాపై ఆంక్షలు విధించింది. త్వరలో దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని అమెరికా ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా.. గత కొద్దికాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల హాంకాంగ్‌పై చైనా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉభయ దేశాల మధ్య విమానాల రాకపోకలపై జరిగిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని అమెరికా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది. చైనా ప్రభుత్వం ఎన్ని అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతిస్తుందో, అన్నే విమానాలను తాము కూడా అమెరికాలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది.