అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు సంబంధించి విచారణను ఫిబ్రవరి 9 నుంచి చేపట్టాలని సెనేట్ నిర్ణయించింది. ఈ నెల 6 న క్యాపిటల్ హిల్ లో అల్లర్లకు, ఘర్షణలకు ఆయనను బాధ్యుడ్ని చేయాలా అన్న అంశంపై సెనేట్ చర్చిస్తూ వచ్చింది. ప్రధానంగా దీనిపై రెండువారాల జాప్యం జరిగింది. చివరకు మెజారిటీ లీడర్ చార్లెస్ షుమర్, మైనారిటీ లీడర్ మిచ్ మెక్ కానెల్ మధ్య ఒప్పందం కుదిరింది. విచారణ టైమింగ్ విషయంలో మొదట రెండు పక్షాల మధ్య వివాదం తలెత్తింది. ట్రంప్ ను శాశ్వతంగా పదవికి అనర్హుడ్ని చేయాలా అన్నదే ముఖ్య అజెండా అయింది. ఈ నెల 13 న సభ ట్రంప్ అభిశంసనకు ఉద్దేశించిన ఆర్టికల్ ను ఆమోదించినప్పటికీ విచారణ ఎప్పటి నుంచి ప్రారంభించాలన్నదే వివాదాస్పదంగా మారింది. దీన్ని త్వరగా చేపట్టాలని హౌస్ లీడర్స్ కోరుతూ వచ్చారు. కానీ మాజీ, ప్రస్తుత అధ్యక్షుల మధ్య ఈ విషయంలో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. తన రక్షణకు ఓ టీమ్ ను సమీకరించేందుకు ట్రంప్ ట్రంప్ నానా అవస్థలు పడగా.. తన కేబినెట్ సహచరుల్లో పలువురి నియామక ధ్రువీకరణ కోసం సెనేట్ కి సమయం ఇవ్వాలని జో బైడెన్ సూచిస్తూవచ్చారు. దీనివల్ల ఆలస్యం జరిగింది.
చివరకు తాజాగా ట్రంప్ అభిశంశన విచారణ ప్రారంభించేందుకు ఫిబ్రవరి 9 న ముహూర్తంగా నిర్ణయించారు.
కిస్తీ కట్టాలంటూ ఫైనాన్స్ కంపెనీ వరుస ఫోన్ కాల్స్.. టార్చర్ తట్టుకోలేక ఆటోని తగలబెట్టిన వ్యక్తి