మహిళా ‘భక్తుల’ శీలం దోచుకునే ‘అమెరికన్ గురు’కి 120 ఏళ్ళ జైలుశిక్ష

| Edited By: Anil kumar poka

Oct 28, 2020 | 12:50 PM

అమెరికాలో మహిళలను తన బానిసలుగా మార్చుకుంటూ వారితో 'సెక్స్ కల్ట్ ' నడుపుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 60 ఏళ్ళ 'సెల్ఫ్ హెల్ప్ గురు' ..కీత్ రానీరేకి న్యూయార్క్ కోర్టు 120 ఏళ్ళ జైలుశిక్ష విధించింది.

మహిళా భక్తుల శీలం దోచుకునే అమెరికన్ గురుకి 120 ఏళ్ళ జైలుశిక్ష
Follow us on

అమెరికాలో మహిళలను తన బానిసలుగా మార్చుకుంటూ వారితో ‘సెక్స్ కల్ట్ ‘ నడుపుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 60 ఏళ్ళ ‘సెల్ఫ్ హెల్ప్ గురు’ ..కీత్ రానీరేకి న్యూయార్క్ కోర్టు 120 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. ఇతనిపై ఆరు వారాల పాటు విచారణ జరిగింది. ఎన్ ఎక్స్ ఐ వీ ఎం అనే లైఫ్ కోచింగ్ గ్రూప్ ముసుగులో ముఖ్యంగా ధనవంతులైన మహిళలను  తన సెక్స్ బానిసలుగా చేసుకునేవాడనే ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. ఈ గ్రూపులో చేరాలంటే 5 రోజుల సెల్ఫ్ హెల్ప్ కోర్సులకు గాను 5 వేల డాలర్లు చెల్లించాలనే రూల్ పెట్టాడని, కొంతమంది స్త్రీలను ఆర్థికంగా, లైంగికంగా వాడుకోవడమే గాక, వారి చేత తప్పనిసరిగా ‘డైట్’ పాటించాలని ఒత్తిడి తెచ్చేవాడని తెలిసింది. అందుకు ఇతడిని ‘భక్తులు’ (బానిసలు) ‘వాన్ గార్డ్’ గా వ్యవహరించేవారట. కీత్ కథనం ఇంకా చాలా ఉంది.   గ్రూప్ లో ‘డీఓఎస్’ అనే ఫ్యాక్షన్ ని కూడా ఏర్పాటు చేశాడని, ఇది పిరమిడ్ స్ట్రక్చర్ లా  ఉంటుందని,ఇందులో బానిసలుగా మహిళలు ఉంటే టాప్ లో కీత్ ‘గ్రాండ్ మాస్టర్’ మాదిరి కూర్చునేవాడని తెలిసింది.

గత ఏడాది జూన్ లో కీత్ దారుణాలు బయటపడ్డాయి. ఇతనిపై సెక్స్ ట్రాఫికింగ్, దోపిడీ, నేరపూరిత కుట్ర వంటి ఏడు కేసులను నమోదు చేశారు. కీత్ పై 13 మంది మహిళలు న్యూయార్క్ లోని బ్రూక్లిన్ కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఒక విధంగా ఫిర్యాదు చేశారు. 90 మందికి పైగా బాధితులు న్యాయమూర్తి నికోలస్ గరౌఫీస్ కి లేఖలు రాశారు. కీత్ గ్రూపులో 15 ఏళ్ళ మైనర్ బాలిక కూడా ఉండడం దారుణం. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు తానేమీ బాధ పడడంలేదని, పశ్చాత్తాపపడడం లేదని కీత్ చెప్పాడు. ఏమైనా ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలన్నాడు.

1998 లో కీత్ సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్ కోర్స్ పేరిట న్యూయార్క్ లో ఎన్ ఎక్స్ ఐ వీ ఎం (నెక్సీయం) అనే గ్రూపును ఏర్పాటు చేశాడు. 2018 లో మెక్సికోలో ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆరోపణలు రుజువు కాకపోవడంతో బయటపడ్డాడు.