ఇరాన్ వర్సెస్ అమెరికా.. అసలేం జరుగుతోంది..?

కొద్ది రోజులుగా ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధవాతావరణం తలపిస్తోంది. అమెరికా అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా తప్పుకోవడంతో పాటు ఇరాన్ పై ఆంక్షలు విధించడంతో పరిణామాలు మారుతున్నాయి. తమ డ్రోన్ కూల్చడంతో పాటు.. ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేసినందుకు ఇరాన్ పై బాంబు దాడులు చేస్తానని అమెరికా బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఇరు దేశాల్లో మార్పులు సంభవించాయి. అణ్వస్త్ర దేశాలు, ఇరాన్ మధ్య కుదిరిన అణుఒప్పందం నుంచి 2015లో అమెరికా వైదొలగడంతో అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య […]

ఇరాన్ వర్సెస్ అమెరికా.. అసలేం జరుగుతోంది..?

Edited By:

Updated on: Jun 24, 2019 | 7:03 PM

కొద్ది రోజులుగా ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధవాతావరణం తలపిస్తోంది. అమెరికా అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా తప్పుకోవడంతో పాటు ఇరాన్ పై ఆంక్షలు విధించడంతో పరిణామాలు మారుతున్నాయి. తమ డ్రోన్ కూల్చడంతో పాటు.. ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేసినందుకు ఇరాన్ పై బాంబు దాడులు చేస్తానని అమెరికా బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఇరు దేశాల్లో మార్పులు సంభవించాయి.

అణ్వస్త్ర దేశాలు, ఇరాన్ మధ్య కుదిరిన అణుఒప్పందం నుంచి 2015లో అమెరికా వైదొలగడంతో అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

అమెరికా దుశ్చర్యలకు పాల్పడితే ప్రతికార చర్యగా అమెరికా మిత్రపక్ష దేశాలపై దాడులు చేస్తానని ఇరాన్ హెచ్చరించింది. తాజాగా ఇరాన్ పై మరోసారి అమెరికా అదనపు ఆంక్షలు విధించింది. అణుబాంబు తయారు చేస్తోందంటూ.. ఇక ఈ ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. అంతేకాకుండా సైనిక చర్య యోచన విరమించుకోలేదని ట్రంప్ పేర్కొన్నారు. గల్ఫ్ జరుగుతున్న పరిణామాలు భారత్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. ఇండియాకు ముడి చమురు భారత్ నుంచే వస్తోంది. గల్ఫ్ లో ఉద్రిక్త పరిస్థితులు సంభవిస్తే.. ఇండియా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.