హూస్టన్ లోని మీ దౌత్య కార్యాలయాన్ని మూసివేయండి…చైనాకు అమెరికా అల్టిమేటం

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2020 | 4:00 PM

అమెరికా-చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో దెబ్బ! హూస్టన్ (టెక్సాస్) లోని మీ దౌత్య కార్యాలయాన్ని (కాన్సులేట్ జనరల్ ఆఫ్ చైనా) 72 గంటల్లోగా మూసివేయాలని ట్రంప్ ప్రభుత్వం చైనాను ఆదేశించింది. ఈ ఆఫీసు ఆవరణలో చైనా దౌత్య సిబ్బంది కొందరు కొన్ని డాక్యుమెంట్లను, ఇతర సామాగ్రిని తగులబెట్టడాన్ని స్థానిక టీవీ కేంద్రాలు ప్రసారం చేశాయి. వారు వీటిని ఓపెన్ కంటెయినర్లలో వేసి తగులబెట్టడం, వాటిలో నుంచి మంటలు రావడాన్ని స్థానికులు కూడా చూశారు.  రాత్రి 8 […]

హూస్టన్ లోని మీ దౌత్య  కార్యాలయాన్ని మూసివేయండి...చైనాకు అమెరికా అల్టిమేటం
Follow us on

అమెరికా-చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో దెబ్బ! హూస్టన్ (టెక్సాస్) లోని మీ దౌత్య కార్యాలయాన్ని (కాన్సులేట్ జనరల్ ఆఫ్ చైనా) 72 గంటల్లోగా మూసివేయాలని ట్రంప్ ప్రభుత్వం చైనాను ఆదేశించింది. ఈ ఆఫీసు ఆవరణలో చైనా దౌత్య సిబ్బంది కొందరు కొన్ని డాక్యుమెంట్లను, ఇతర సామాగ్రిని తగులబెట్టడాన్ని స్థానిక టీవీ కేంద్రాలు ప్రసారం చేశాయి. వారు వీటిని ఓపెన్ కంటెయినర్లలో వేసి తగులబెట్టడం, వాటిలో నుంచి మంటలు రావడాన్ని స్థానికులు కూడా చూశారు.  రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇక్కడ ఈ ఘటన జరుగుతున్నట్టు తమకు సమాచారం అందిందని, తాము ఫైర్ సిబ్బందితో బాటు అక్కడికి చేరుకున్నప్పటికీ దౌత్యాధికారులు తమను కార్యాలయ ఆవరణలోకి అనుమతించలేదని హూస్టన్ పోలీసులు తెలిపారు.

కాగా…. అమెరికా ఇలా అర్ధాంతరంగా ఆదేశించడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చైనా ఆరోపించింది. ఆ దేశం నుంచి తమకు అధికారిక ఆదేశాలు అందకపోయినప్పటికీ.. ఇక ఈ కార్యాలయంలో  కార్యకలాపాలను నిలిపివేయాలని, మూడు రోజుల్లోగా దీన్ని మూసివేయాలని కోరడం దారుణమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ ఆరోపించారు. ఉభయ దేశాల దౌత్య సంబంధాలను ఇది తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు.  చైనాకు చెందిన గ్లోబల్ టైంస్ కూడా ఇదే విషయాన్ని పేర్కొంది.