AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హూస్టన్ లోని మీ దౌత్య కార్యాలయాన్ని మూసివేయండి…చైనాకు అమెరికా అల్టిమేటం

అమెరికా-చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో దెబ్బ! హూస్టన్ (టెక్సాస్) లోని మీ దౌత్య కార్యాలయాన్ని (కాన్సులేట్ జనరల్ ఆఫ్ చైనా) 72 గంటల్లోగా మూసివేయాలని ట్రంప్ ప్రభుత్వం చైనాను ఆదేశించింది. ఈ ఆఫీసు ఆవరణలో చైనా దౌత్య సిబ్బంది కొందరు కొన్ని డాక్యుమెంట్లను, ఇతర సామాగ్రిని తగులబెట్టడాన్ని స్థానిక టీవీ కేంద్రాలు ప్రసారం చేశాయి. వారు వీటిని ఓపెన్ కంటెయినర్లలో వేసి తగులబెట్టడం, వాటిలో నుంచి మంటలు రావడాన్ని స్థానికులు కూడా చూశారు.  రాత్రి 8 […]

హూస్టన్ లోని మీ దౌత్య  కార్యాలయాన్ని మూసివేయండి...చైనాకు అమెరికా అల్టిమేటం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 22, 2020 | 4:00 PM

Share

అమెరికా-చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో దెబ్బ! హూస్టన్ (టెక్సాస్) లోని మీ దౌత్య కార్యాలయాన్ని (కాన్సులేట్ జనరల్ ఆఫ్ చైనా) 72 గంటల్లోగా మూసివేయాలని ట్రంప్ ప్రభుత్వం చైనాను ఆదేశించింది. ఈ ఆఫీసు ఆవరణలో చైనా దౌత్య సిబ్బంది కొందరు కొన్ని డాక్యుమెంట్లను, ఇతర సామాగ్రిని తగులబెట్టడాన్ని స్థానిక టీవీ కేంద్రాలు ప్రసారం చేశాయి. వారు వీటిని ఓపెన్ కంటెయినర్లలో వేసి తగులబెట్టడం, వాటిలో నుంచి మంటలు రావడాన్ని స్థానికులు కూడా చూశారు.  రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇక్కడ ఈ ఘటన జరుగుతున్నట్టు తమకు సమాచారం అందిందని, తాము ఫైర్ సిబ్బందితో బాటు అక్కడికి చేరుకున్నప్పటికీ దౌత్యాధికారులు తమను కార్యాలయ ఆవరణలోకి అనుమతించలేదని హూస్టన్ పోలీసులు తెలిపారు.

కాగా…. అమెరికా ఇలా అర్ధాంతరంగా ఆదేశించడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చైనా ఆరోపించింది. ఆ దేశం నుంచి తమకు అధికారిక ఆదేశాలు అందకపోయినప్పటికీ.. ఇక ఈ కార్యాలయంలో  కార్యకలాపాలను నిలిపివేయాలని, మూడు రోజుల్లోగా దీన్ని మూసివేయాలని కోరడం దారుణమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ ఆరోపించారు. ఉభయ దేశాల దౌత్య సంబంధాలను ఇది తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు.  చైనాకు చెందిన గ్లోబల్ టైంస్ కూడా ఇదే విషయాన్ని పేర్కొంది.

Follow Us
నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే
నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే
ఊహించని విషాదం.. కిరణ్ అబ్బవరం అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా?
ఊహించని విషాదం.. కిరణ్ అబ్బవరం అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా?
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే
గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు వెంటనే అప్డేట్ చేస్కోండి..
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు వెంటనే అప్డేట్ చేస్కోండి..
నొప్పులు, డిప్రెషన్ తగ్గించే 'డాక్టర్ ఫిష్' గురించి మీకు తెలుసా
నొప్పులు, డిప్రెషన్ తగ్గించే 'డాక్టర్ ఫిష్' గురించి మీకు తెలుసా
వెదురుతో ఇంటిని స్టైలిష్‌గా మార్చేసే సూపర్ ఐడియాస్..
వెదురుతో ఇంటిని స్టైలిష్‌గా మార్చేసే సూపర్ ఐడియాస్..
ఘుమఘుమలాడే స్పైసీ పీతల వేపుడు.. రెస్టారెంట్ స్టైల్‌లో
ఘుమఘుమలాడే స్పైసీ పీతల వేపుడు.. రెస్టారెంట్ స్టైల్‌లో
వర్షాకాలంలో ఈ పుట్టగొడుగులు తింటే ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ పుట్టగొడుగులు తింటే ప్రాణాలకే ప్రమాదం!