ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన మెలానియా ట్రంప్ !

|

Oct 20, 2020 | 2:50 PM

అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలో మెలానియా ట్రంప్ తిరిగి పాల్గొనబోతున్నారు.

ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన మెలానియా ట్రంప్ !
Follow us on

అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలో మెలానియా ట్రంప్ తిరిగి పాల్గొనబోతున్నారు. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా మంగళవారం సాయంత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తొలిసారిగా బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు. మెలానియా ట్రంప్ కు కరోనా సోకడంతో ఆమెపై ప్రయాణ ఆంక్షలు విధించారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న మెలానియా ట్రంప్ పెన్సిల్వేనియా ర్యాలీలో అధ్యక్షుడితో కలిసి పాల్గొంటారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇతర కుటుంబసభ్యులు చురుకుగా పాల్గొంటున్నారు. ఈ వారం ఇవాంకా ట్రంప్ మిచిగాన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రచార బృందం.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రచార ర్యాలీలో పాల్గొనే వారికి థర్మల్ స్క్రీన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 29న తొలి ముఖాముఖిలో పాల్గొన్న తర్వాత ట్రంప్.. అనంతరం ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఆయన కుమారుడు సైతం కరోనా బారినపడిన విషయం తెలిసిందే.