కోవిడ్ పై బాగానే పోరాడుతున్నాం, కానీ పాపం ! ఇండియానే ! ట్రంప్ జాలి ‘గుండె’

| Edited By: Pardhasaradhi Peri

Aug 04, 2020 | 6:41 PM

కోవిడ్-19 పై తాము బాగానే పోరాడుతున్నామని, కానీ పాపం ఇండియాయే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాలిపడ్డారు. ఈ వైరస్ ని ఎదుర్కొనేందుకు..

కోవిడ్ పై బాగానే పోరాడుతున్నాం, కానీ పాపం ! ఇండియానే ! ట్రంప్ జాలి గుండె
Follow us on

కోవిడ్-19 పై తాము బాగానే పోరాడుతున్నామని, కానీ పాపం ఇండియాయే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాలిపడ్డారు. ఈ వైరస్ ని ఎదుర్కొనేందుకు భారత్ నానా తంటాలూ పడుతోందన్నారు. ఇక చైనా విషయానికి వస్తే..ఆ దేశం పెద్దఎత్తున ఇన్ఫెక్షన్లతో సతమతమవుతోందన్నారు. ఇండియాలో మంగళవారం కరోనా వైరస్ కేసుల సంఖ్య 18,55,745 కి పెరిగింది. 52,050 మందికి ఇన్ఫెక్షన్లు సోకాయి. ఇక చైనాలో 35 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్న 46 కేసులు నమోదయ్యాయి.

ఇదంతా చూస్తే..ఇతర దేశాల కన్నా మనమే చాలా నయం.. మీరు నిజంగా చూస్తే..ఈ దేశాలన్నీ  గందరగోళ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటున్నాయో మీకే అర్థమవుతుంది అని మీడియాను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. నిజానికి అమెరికాలో 40 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. లక్షా 55 వేల మరణాలు సంభవించాయి.  60 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకిందని ప్రకటించిన ట్రంప్ గారు ఇప్పుడు తామే అన్ని దేశాలకన్నా బెటరని జబ్బలు చరుచుకుంటున్నారు.