మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం, కంగ్రాట్స్ చెప్పిన ట్రంప్. త్వరలో మాస్ వ్యాక్సినేషన్

| Edited By: Anil kumar poka

Dec 19, 2020 | 2:49 PM

మోడెర్నా కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. గతవారం ఫైజర్ టీకామందు వినియోగానికి కూడా ఇక్కడి రెగ్యులేటరీ సంస్థలు ఆమోదం తెలిపాయి.

మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం, కంగ్రాట్స్ చెప్పిన ట్రంప్. త్వరలో మాస్ వ్యాక్సినేషన్
Follow us on

మోడెర్నా కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. గతవారం ఫైజర్ టీకామందు వినియోగానికి కూడా ఇక్కడి రెగ్యులేటరీ సంస్థలు ఆమోదం తెలిపాయి. మోడెర్నా టీకామందు అందరికీ అందుబాటులోకి వచ్చిందని ట్వీట్ చేసిన అధ్యక్షుడు ట్రంప్.. ఈ సంస్థకు కంగ్రాట్స్ చెప్పారు. ఇప్పటివరకు ఈ మందు విషయంలో నోరెత్తని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దీని అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు. దీని ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతిస్తున్నామని ఈ సంస్థ ప్రకటించింది. త్వరలో మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని వెల్లడించింది.

అటు-ఇప్పటికే అమెరికాలో వేలాది హెల్త్ వర్కర్లు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. తమకు వచ్ఛే ఏడాది పూర్తి లైసెన్స్ లభించవచ్చునని  మోడెర్నా సంస్థ ఆశిస్తోంది. (ఇంతవరకు అమెరికా ప్రభుత్వం నుంచి ఈ కంపెనీకి పూర్తి లైసెన్స్ లభించలేదు.) ఒకప్పుడు కనీసం మాస్క్ ధరించడానికైనా వెనుకంజ వేసిన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ని సాదరంగా దేశంలోకి ‘ఆహ్వానించడం’ విశేషం. పైగా మోడెర్నా ను ఆయన అభినందించారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులను అదుపు చేసేందుకు వ్యాక్సిన్ ఎంతయినా అవసరమని ఆయన నమ్ముతున్నారు. ఇలా ఉండగా ధనిక, పేద దేశాలన్న భేదం లేకుండా అన్ని దేశాలకూ తమ కోవాక్స్ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ ప్రకటించారు. అనేక దేశాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం హర్షణీయమని, కానీ,, ఇదే సమయంలో ఈ వైరస్ పూర్తి నిర్మూలన జరగాలంటే ఇంకా పెద్దఎత్తున పోరాటం జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. తమ సంస్థ వద్ద దాదాపు 2 బిలియన్ డోసుల వ్యాక్సిన్ సిధ్ధంగా ఉందని, ఈ టీకామందు తీసుకోవడానికి ఏ దేశమూ సందేహించాల్సిన అవసరం లేదని టెడ్రోస్ అన్నారు. ఈ విషయమై ఆ యా దేశాలతో కాంటాక్ట్ లో ఉంటున్నట్టు అయన చెప్పారు.