నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వరుణ్ తేజ్ తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. గద్దల కొండ గణేశ్ సినిమాతో ఇమేజ్‌ను అమాంతం పెంచుకున్నాడు. తాజాగా ఈ మెగా ప్రిన్స్ తన10వ సినిమాగా బాక్సింగ్ డ్రామాను చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గని అనే టైటిల్‌తో రూపొందుతుంది. ‘బాలు’ సినిమాలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర పేరు గని కావడంతో ఈ చిత్ర టైటిల్ మెగా అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తమన్ ‘గని’కి అద్భుతమైన నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. కన్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 30న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర టీంతో కలిసారు. ఆయనకు చిత్ర బృందం పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికింది. ఉపేంద్ర పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
Chor Bazaar Movie : జార్జిరెడ్డి డైరెక్టర్‌తో ఆకాష్ పూరీ.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా..