Upasana Tweet Natyam First Look: అపోలో వారసురాలిగా తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకున్నారు ఉపాసన. మెగా కోడలిగ మారిన తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక వ్యాపారంలోనూ తనదైన ముద్రవేస్తూ రాణిస్తున్నారు ఉపాసన.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన భర్త రామ్‌చరణ్‌కు సంబంధించిన విశేషాలతో తన వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన ట్విట్టర్ వేదికగా ఓ కొత్త సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేశారు. తన స్నేహితురాలు.. ప్రముఖ కూచిపుడి డ్యాన్సర్ సంధ్యా రాజు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. ఈ సందర్భంగా సంధ్యా రాజును పరిచయం చేస్తూ.. తన తొలి చిత్రం ‘నాట్యం’ ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు ఉపాసన. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు.. ‘నా స్నేహితురాలు సంధ్యా రాజును పరిచయం చేస్తున్నాను. తాను నటిస్తోన్న తొలి చిత్రం ‘నాట్యం’ ఫస్ట్ లుక్. ఈ చిత్రానికి రేవంత్ కొరుకొండ దర్శకత్వం’ వహిస్తున్నారు అని క్యాప్షన్ జోడించారు ఉపాసన. ఇదిలా ఉంటే ఈ సినిమాను హంపి, లేపాక్షిలతో పాటు బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ దేవాలయాల్లో తెరకెక్కిస్తున్నారు.
Here’s Introducing my dear friend
Sandhya Raju’s
‘ First Look Motion Poster ‘
from her upcoming Debut Telugu Feature Film titled
‘Natyam’ ?
Directed by Revanth Korukonda @sandhyaraju @RevanthOfficial@NatyamTheMovie #sandhyaraju #revanthkorukonda#natyamthemovie pic.twitter.com/Irj1LPQNWT— Upasana Konidela (@upasanakonidela) January 23, 2021
Also Read: Shruti Haasan: పెళ్లి చేసుకోబోతున్నారా అనే ప్రశ్నకు.. కమల్ కూతురు ఏం సమాధానం చెప్పిందో తెలుసా..