యూపీలో మరోసారి వెలుగుచూసిన మతమార్పిడి వ్యవహారం.. బాలికను కిడ్నాప్ చేసిన యువకుడి అరెస్ట్

|

Dec 17, 2020 | 5:40 PM

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన నేరగాళ్లను ఏమాత్రం భయపెట్టలేకపోతున్నాయి. చట్టాలను సైతంగా చుట్టాలుగా మార్చుకునేందుకు యత్నించి ఖాకీలకు చిక్కుతున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లో మరో మతమార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

యూపీలో మరోసారి వెలుగుచూసిన మతమార్పిడి వ్యవహారం.. బాలికను కిడ్నాప్ చేసిన యువకుడి అరెస్ట్
Follow us on

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన నేరగాళ్లను ఏమాత్రం భయపెట్టలేకపోతున్నాయి. చట్టాలను సైతంగా చుట్టాలుగా మార్చుకునేందుకు యత్నించి ఖాకీలకు చిక్కుతున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లో మరో మతమార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెను బలవంతంగా మత మార్పిడి చేసేందుకు యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ పట్టణంలో చోటుచేసుకుంది. బిజ్నూర్ పట్టణానికి చెందిన సాకిబ్.. ధాంపూర్ ప్రాంతానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులకు ఎవరికి చెప్పకుండా బాలికను కిడ్నాప్ చేసి ఆమెను మతమార్పిడి చేసేందుకు యత్నించాడని బిజ్నూర్ రూరల్ ఎస్పీ సంజయ్ కుమార్ చెప్పారు.

ఇదిలావుంటే, ధాంపూర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక గత కొన్ని రోజులుగా అదృశ్యమైంది. సాకిబ్ తన పేరు సోను అని చెప్పి బాలికను కిడ్నాప్ చేసి మతమార్పిడికి బలవంతం చేశాడు. దీంతో సాకిబ్ పై మతమార్పిడి యత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. బాలిక మైనర్ అని, నిందితుడు ముస్లిమ్ అని అమ్మాయికి తర్వాత తెలిసిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.