అక్కడ.. షాపింగ్‌ మాల్స్‌లో మద్యం అమ్మకాలు షురూ..!

యూపీలోని షాపింగ్ మాల్స్‌లో జూలై 27 నుంచి ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని విక్రయించడానికి లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దిగుమతి చేసుకున్న మద్యం

అక్కడ.. షాపింగ్‌ మాల్స్‌లో మద్యం అమ్మకాలు షురూ..!

Edited By:

Updated on: Jul 25, 2020 | 8:03 PM

యూపీలోని షాపింగ్ మాల్స్‌లో జూలై 27 నుంచి ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని విక్రయించడానికి లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దిగుమతి చేసుకున్న మద్యం ఆగస్టు 25 నుంచి మాల్స్‌లో విక్రయించుకోవచ్చని పేర్కొంది. విదేశీ మద్యం, ఇండియన్ స్కాచ్, బ్రాందీ, జిన్, వైన్, వోడ్కా, రమ్ రూ.700 కంటే ఎక్కువ ధర గల మద్యంతో పాటు ఒక బీరు రూ.160 అంతకంటే అధిక ధరల్లో మాల్స్‌లో మద్యం లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

ఏడాదికి లైసెన్స్ ఫీజును రూ.12 లక్షలుగా నిర్ణయించారు. దీన్ని ఏవ్యక్తి అయినా పొందవచ్చు. ఈ మాల్స్‌ ఉదయం 10 నుంచి 9 గంటల వరకు పనిచేయడానికి అనుమతించబడతాయని వినియోగదారులు అవుట్‌లెట్లలోకి ప్రవేశించి అల్మారాల నుంచి బ్రాండ్లను ఎంచుకోవచ్చు అని ఎక్సైజ్ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ అన్నారు. “గత కొన్ని సంవత్సరాలుగా, మాల్స్ నుంచి షాపింగ్ చేసే ధోరణి వేగంగా పెరిగింది. దీన్ని చూసే షాపింగ్ మాల్స్ నుంచి ఖరీదైన విదేశీ మద్యం అమ్మకాలను అనుమతించాలని రాష్ట్రం నిర్ణయించింది” అని సంజయ్ తెలిపారు.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!