ఉన్నావ్ రేప్ కేసు.. నిందితుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు

|

Dec 07, 2019 | 12:50 PM

యూపీలో ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు 23 ఏళ్ళ యువతి ఢిల్లీ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. (ఈమెపై 2017 లో అత్యాచారం జరిగింది.) ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బాధితురాలు గత గురువారం కోర్టుకు వెళ్తుండగా ముగ్గురు నిందితులు ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలైన ఆమెను మొదట లక్నోలోని ఆసుపత్రికి, ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. అయితే […]

ఉన్నావ్ రేప్ కేసు.. నిందితుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు
Follow us on

యూపీలో ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు 23 ఏళ్ళ యువతి ఢిల్లీ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. (ఈమెపై 2017 లో అత్యాచారం జరిగింది.) ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బాధితురాలు గత గురువారం కోర్టుకు వెళ్తుండగా ముగ్గురు నిందితులు ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలైన ఆమెను మొదట లక్నోలోని ఆసుపత్రికి, ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితురాలు శుక్రవారం కన్ను మూసింది. ఇప్పటికే దిశ ఉదంతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఉన్నావ్ ఘటనను సీరియస్ గా తీసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. దీనిపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దోషులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామన్నారు. కాగా- ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురితో బాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వారిని త్వరలో కోర్టులో హాజరు పరచడానికి సిధ్ధమయ్యారు. కాగా.. మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో దిశ హత్యాచారానికి బాధ్యులైన నలుగురు మృగాళ్లను పోలీసులు ఎలా ఎన్ కౌంటర్లో హతమార్చారో తన కూతురి మరణానికి కారణమైన కిరాతకులను కూడా అలాగే ఎన్ కౌంటర్ చేసి చంపేయాలని డిమాండ్ చేశారు.