బ్రీత్‌ అనలైజర్‌తో కరోనా నిర్ధారణ పరీక్ష..!

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా లేదు. మెల్ల మెల్లగా అన్ని ప్రాంతాలను అక్రమిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో ఈ టెస్టులను నిర్వహిస్తున్నారు.

బ్రీత్‌ అనలైజర్‌తో కరోనా నిర్ధారణ పరీక్ష..!

Updated on: Oct 31, 2020 | 5:01 PM

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా లేదు. మెల్ల మెల్లగా అన్ని ప్రాంతాలను అక్రమిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో ఈ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కొవిడ్‌-19ను నిర్ధారించేందుకు ముక్కు లేదా నోటి ద్వారా స్వాబ్‌ను సేకరించి కొవిడ్‌ ఉందో లేదో పరీక్షిస్తున్నారు. దీనివల్ల డబ్బుతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. పైగా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడమూ కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి సమయంలో చిన్నపాటి బ్రీత్‌ టెస్ట్‌ ద్వారా కొవిడ్‌-19ను నిర్ధారించగలిగితే ఎలా ఉంటుంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. అమెరికా ఫ్లోరిడాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ పరిశోధకులు అలాంటి ఓ కొత్త టెస్టును అభివృద్ధి చేశారు. అర్ధరాత్రివేళ మందుబాబులు వాహనాలు నడపకుండా గుర్తించేందుకు పోలీసులు ఉపయోగించే బ్రీత్‌ అనలైజర్‌ లాంటిదే ఈ టెస్ట్‌.

చిన్నపాటి ట్యూబ్‌లోకి ఊదడం ద్వారా వచ్చే గాలి తుంపర్లను భద్రపరిచి స్కానర్‌ ద్వారా పరిశీలించి ఆ మనిషికి కొవిడ్‌ ఉందో లేదో నిర్ధారించడం ఈ టెస్ట్‌ ఉద్దేశం. ఇజ్రాయెల్‌ రూపొందించిన బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ దీన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టింది. అతి తక్కువ సమయంలో కొవిడ్‌ను నిర్ధారించడమే లక్ష్యంగా దీన్ని చేపట్టినట్లు పరిశోధకులు తెలిపారు. ఇది గనుక సత్ఫలితాలనిస్తే గేమ్‌ ఛేంజర్‌ కానుందని మిల్లర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఛైర్మన్‌ ఈ వెయిస్‌ అన్నారు. దీని ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు, అవసరమైన చోట ఉపయోగించుకునే వీలుంటుందని ఆయన తెలిపారు. కరోనా పరీక్ష సామర్థ్యాన్ని విశ్లేషించేందుకు సుమారు వెయ్యి నమూనాలను ఇజ్రాయెల్‌కు చెందిన టెరా గ్రూప్‌ అనుబంధ సంస్థ బయో సేఫ్టీ టెక్నాలజీస్‌కు యూనివర్సిటీ అందివ్వనుంది. ఇందుకోసం అధ్యాపకులు, సిబ్బంది నుంచి పెద్ద ఎత్తున నమూనాలను సేకరించనుంది. ఈ ప్రయోగాలు మొదలు పెట్టేందుకు సాంకేతికత వినియోగానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి అనుమతులు లభిస్తే రియల్‌టైమ్‌లో కొవిడ్‌ నిర్ధారించడంతో పాటు వ్యాధి వ్యాప్తిని మరింత సమర్థంగా అరికట్టేందుకు వీలు పడుతుందని ఈ పరిశోధనలో భాగస్వామి అయిన ఎరియన్‌ కొబెట్జ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

Follow Us