Storm Bella : యూకేలో బెల్లా తుపాను బీభత్సం..వణికిపోతున్న సెంట్రల్ ఇంగ్లీష్ కౌంటీ..

|

Dec 26, 2020 | 9:29 PM

క్రిస్మస్‌ వేళ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను వరదలు ముంచెత్తాయి. బెల్లా తుపాను కారణంగా గ్రేట్‌ ఓస్‌ నది పొంగడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.. సెంట్రల్ ఇంగ్లీష్ కౌంటీ బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Storm Bella : యూకేలో బెల్లా తుపాను బీభత్సం..వణికిపోతున్న సెంట్రల్ ఇంగ్లీష్ కౌంటీ..
Follow us on

Storm Bella Crashed : యునైటెడ్‌ కింగ్‌డమ్‌ బెల్లా తుపాను బీభత్సం రేపింది. 70 మైళ్ల వేగంతో వీచిన తుపాను గాలుల ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. గ్రేట్‌ ఓస్‌ నది ఉప్పొంగింది. దీంతో సెంట్రల్ ఇంగ్లీష్ కౌంటీ బెడ్‌ఫోర్డ్‌షైర్‌తో పాటు పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.

క్రిస్మస్‌ వేళ ఈ వరదలు ఇక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగించాయి. పండుగ నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు. ఈ ప్రాంతాలన్నీ వరదల్లో చిక్కుకున్నాయి. ఇలాంటి పరిస్థితిని తాము ఎప్పుడూ చూడలేదంటున్నారు ఈ ప్రాంత వాసులు..

మరోవైపు పోర్చుగల్​లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. మెడీరా ద్వీపాన్ని వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం వాల్లింది. పలు ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని చెబుతున్నారు.