దుబాయ్‌లోని భారతీయులకు గుడ్ న్యూస్.. ఫేక్ జాబ్ ఆఫర్లకు పీబీఎస్‌కే యాప్‌తో కత్తెర..

|

Jan 22, 2021 | 5:50 AM

విజృంభణ నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న భారతీయులు తిరిగి యూఏఈకి వచ్చినట్టు కేంద్ర మంత్రి వీ.మురళీధరన్ తెలిపారు. పీబీఎస్‌కే యాప్...

దుబాయ్‌లోని భారతీయులకు గుడ్ న్యూస్.. ఫేక్ జాబ్ ఆఫర్లకు పీబీఎస్‌కే యాప్‌తో కత్తెర..
Follow us on

Skill Centre For Blue-Collar Workers : విజృంభణ నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న భారతీయులు తిరిగి యూఏఈకి వచ్చినట్టు కేంద్ర మంత్రి వీ.మురళీధరన్ తెలిపారు. పీబీఎస్‌కే యాప్(PBSK app)‌ను దుబాయిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం మే 7న వందే భారత్ మిషన్ ప్రారంభించిందని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో యూఏఈ(UAE)లోని సుమారు 13లక్షల మంది భారతీయులు ఇండియాకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారిలో సుమారు 11.50లక్షల మంది తిరిగి యూఏఈకి వచ్చినట్టు వెల్లడించారు. మరో 1.50లక్షల మంది యూఏఈకి రావాల్సి ఉందన్నారు.

అయితే కొద్ది మంది ఐసీఏ అప్రోవల్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. ఆ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. అధికారులు వాటికి సంబంధించిన పనిపైనే ఉన్నట్టు చెప్పారు. కాగా.. ఫేక్ జాబ్ ఆఫర్లను నివారించడానికి పీబీఎస్‌కే యాప్..(PBSK app)‌ భారత కార్మికులకు సహాయపడుతుందని కేంద్ర మంత్రి వీ.మురళీధరన్ వెల్లడించారు.