Britain’s Queen Elizabeth : కోవిడ్ టీకాను తీసుకున్న ఎలిజబెత్ రాణి.. ప్రిన్స్ ఫిలిప్..

కోవిడ్ టీకాను క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ తీసుకున్నారు. ఈ మేరకు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. క్వీన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ ఈ రోజు..

Britains Queen Elizabeth : కోవిడ్ టీకాను తీసుకున్న ఎలిజబెత్ రాణి.. ప్రిన్స్ ఫిలిప్..

Updated on: Jan 10, 2021 | 12:07 AM

Britain’s Queen Elizabeth : కోవిడ్ టీకాను క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ తీసుకున్నారు. ఈ మేరకు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. క్వీన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ ఈ రోజు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు..అంటూ ప్యాలెస్ అధికారిక ప్రతినిధి తెలిపారు. వారి నివాసమైన విండ్‌సోర్ క్యాస్టెల్‌లో ఆస్థాన వైద్యుడు ఇంజెక్షన్ ద్వారా టీకా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఇంతకుమించిన సమాచారంను వారు వెల్లడించలేదు.

బ్రిటన్‌లో ఇప్పటి వరకు 1.5 మిలియన్ల మంది టీకాలు వేసుకున్నారు. తొలి విడతలో వృద్ధులు, వారి సంరక్షులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరోవైపు, బ్రిటన్‌లో కరోనా మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. శుక్రవారం 1,325 మంది మృత్యువాత పడ్డారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు 80 వేల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అలాగే, నిన్న 68,053 కొత్త కేసులు వెలుగుచూశాయి.