Ukrainian President Tested Positive : కరోనా ఎవరినీ వదలడం లేదు… ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడైమిర్ జెలెన్‌స్కీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. క్వారంటైన్ పద్ధతులు పాటించినప్పటికీ కరోనా వైరస్ బారినపడినట్లు ట్వీట్టర్ పేర్కొన్నారు.కరోనా ముప్పు లేని అదృష్టవంతులైన వ్యక్తులెవరూ లేరు అంటూ రాసుకొచ్చారు. క్వారంటైన్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను అంటూ పేర్కొన్నారు. విటమిన్ మాత్రలు ఎక్కువగా తీసుకుంటున్నాను… ఐసొలేషన్‌లో ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. అయినప్పటికీ అధికార విధులు నిర్వహిస్తా… చాలా మంది లాగే నేను కూడా కొవిడ్‌ను అదిగమిస్తా అని పేర్కొన్నారు. అంతా మంచే జరుగుతుంది అని తన ట్విట్టర్ లో రాసుకున్నారు.
There are no lucky people for whom #COVID19 does not pose a threat. Despite all the quarantine measures, I received a positive test. I feel good & take a lot of vitamins. Promise to isolate myself, but keep working. I will overcome COVID19 as most people do. It’s gonna be fine!
— Володимир Зеленський (@ZelenskyyUa) November 9, 2020