చైనాకు మరో భారీ షాక్.. హువావేపై నిషేధం..!

| Edited By: Pardhasaradhi Peri

Jul 15, 2020 | 4:35 PM

హువావే.. టెక్నాలజీ రంగంలో ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. చైనాకు చెందిన ఈ టెక్ దిగ్గజం 5జీలో గ్లోబల్ మార్కెట్ లీడర్ అని చెప్పవచ్చు. తాజాగా దీనిపై బ్రిటన్ నిషేదాన్ని విధిస్తూ చైనాకు భారీ షాక్ ఇచ్చింది.

చైనాకు మరో భారీ షాక్.. హువావేపై నిషేధం..!
Follow us on

Huawei Ban In UK: హువావే.. టెక్నాలజీ రంగంలో ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. చైనాకు చెందిన ఈ టెక్ దిగ్గజం 5జీలో గ్లోబల్ మార్కెట్ లీడర్ అని చెప్పవచ్చు. తాజాగా దీనిపై బ్రిటన్ నిషేదాన్ని విధిస్తూ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. యూకేలోని 5జీ నెట్‌వర్క్‌ల నుంచి 2027 కల్లా హువావే పరికరాలను పూర్తిగా తొలగించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హువావేపై అమెరికా తాజాగా విధించిన ఆంక్షలతో పాటు సైబర్ నిపుణుల సలహా మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2021 నుంచి హువావే వద్ద 5జీ పరికరాలను కొనుగోలు చేయకుండా ఉండేలా బ్రిటన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేదాన్ని విధించింది. కాగా, వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి, గోప్యతకు భంగం కలుగుతున్న నేపథ్యంలో భారత్‌లో 59 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో టిక్‌టాక్‌, హలో, షేర్‌‌ఇట్ వంటి యాప్స్ ఉన్న సంగతి తెలిసిందే. అటు అమెరికా కూడా టిక్‌టాక్‌తో సహా పలు చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించే దిశగా అదుగులు వేస్తోంది.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..