చైనా పెట్టుబడులున్న దేశీయ యాప్స్ ఇవే..!

చైనా దురాక్రమాన్నికట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే పూర్తిగా మన దేశం నుంచి చైనా ఛాయలను తొలిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి.

చైనా పెట్టుబడులున్న దేశీయ యాప్స్ ఇవే..!
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 1:13 AM

చైనా దురాక్రమణను, దుడుకుతనాన్ని కట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. డ్రాగన్ కంట్రీపై డిజిటల్ వార్ మొదలుపెట్టిన భారత ప్రభుత్వం.. త్వరలోనే చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేసేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తిగా మన దేశం నుంచి చైనా చిహ్నాలను తొలిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పటి పరిస్థితుల్లో డ్రాగన్ యాప్స్‌ను నిషేధించడం మంచి నిర్ణయమే అయినా.. దేశీయ ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అక్కడి పెట్టుబడుదారులు ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టిన సంగతి మనదేశంలో చాలామంది తెలియదు. ప్రతీరోజూ ప్రజలు వాడే యాప్స్‌లో కొన్నింటిలో చైనా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పేటీఎం: ఆన్లైన్ మొబైల్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్‌కు ఎక్కువగా వాడే ఈ ‘పేటీఎం’ను విజయ్ శేఖర్ శర్మ 2010లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థలో చైనాకు సంబంధించిన సంస్థల వాటా సుమారు 60 శాతం ఉంది. అంతేకాకుండా ఇందులో డ్రాగన్ కంట్రీ దిగ్గజ వ్యాపార సంస్థ అలీబాబా వాటా సుమారు రూ. 4,670 కోట్లు ఉంది.

Also Read: వినియోగదారులకు అలెర్ట్.. ఆధార్ లేకుంటే ఆ మూడు సేవలు అసాధ్యం.!

ఓలా: 2010లో మొదలైన ఈ క్యాబ్ సర్వీస్‌లో చైనాకు చెందిన స్టీడ్ వ్యూ క్యాపిటల్ అనే సంస్థ 2014లో పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత 2018లో టెన్సెంట్ హోల్డింగ్స్‌, సాఫ్ట్‌బ్యాంక్‌, ఆర్‌ఎన్‌టీ క్యాపిటల్‌తో కలిపి సంయుక్తంగా రూ. 8వేల కోట్లకు పైగా పెట్టుబడులను ‘ఓలా’లో పెట్టింది.

స్విగ్గీ: 2014లో శ్రీహర్ష మజెటీ, నందన్ రెడ్డి, రాహుల్ జైమిని కలిసి సంయుక్తంగా ఫుడ్ లవర్స్ కోసం ఈ ‘స్విగ్గీ’ యాప్‌ను రూపొందించారు. అనతికాలంలో ఎక్కువ జనాలను ఆకట్టుకున్న స్విగ్గీలో 2015వ సంవత్సరంలో సైఫ్‌ పార్ట్‌నర్స్, అమెరికాకు చెందిన యాక్సెల్‌తో కలిసి రూ. 15కోట్లు పెట్టుబడి పెట్టగా.. ఆ తర్వాత చైనాకు చెందిన మితుయాన్‌-డియన్‌పింగ్‌, టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, హిల్‌హౌస్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ సుమారు 3-7 వేల కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టింది.

బిగ్ బాస్కెట్: అభినయ్‌ చౌదరి, హరి మీనన్‌, విపుల్‌ పరేక్‌, వీఎస్‌ సుధాకర్‌లు కలిసి సంయుక్తంగా 2011లో ఈ ఆన్లైన్ ఫుడ్ అండ్ గ్రాసరీ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సంస్థలో చైనా దిగ్గజ వ్యాపార సంస్థ అలీబాబా సుమారు రూ. 2.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. బిగ్ బాస్కెట్‌లో ప్రస్తుతం అలీబాబా వాటా 26.26 శాతం అని చెప్పాలి.

ఇవే కాదు.. దేశీయ యాప్స్ అయిన హైక్‌ మెసెంజర్‌,స్నాప్ డీల్, జొమాటో, Byjus, Gaana, Share Chat, Dream 11, Paytm Mall, Policy Baazar, Quikr, Rivigo, Udaan, Hungama, ఓయో, ఫ్లిప్‌కార్ట్‌, మేక్ మై ట్రిప్ లాంటి వాటిల్లో కూడా అత్యధిక పెట్టుబడులు చైనాకు చెందిన కంపెనీలవే కావడం గమనార్హం..

Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!