Breaking: ‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

UK New Coronavirus Strain: సెప్టెంబర్‌లో మొదటిసారి యూకేలో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ 'స్ట్రైయిన్'.. ఇప్పటివరకు భారతదేశంలో...

Breaking: స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

Updated on: Dec 22, 2020 | 4:42 PM

UK New Coronavirus Strain: సెప్టెంబర్‌లో మొదటిసారి యూకేలో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వైరస్ ‘స్ట్రైయిన్’.. ఇప్పటివరకు భారతదేశంలో బయటపడలేదని.. దానికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు చెబుతున్నారు. (New Covid 19 Strain More Contagious)‌

దీనితో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ‘స్ట్రెయిన్’ వైరస్  విషయం తెలిసిన వెంటనే యూరప్‌లోని అనేక దేశాలు యూకేతో రాకపోకలు నిలిపేస్తున్నట్లు వెల్లడించాయి. యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే భారత్ కూడా తాత్కాలికంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31 వరకు ఈ నిబంధనలు అమలులోకి ఉండనున్నాయి. అలాగే యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. (New Covid 19 Strain In UK)

అటు నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు యూకే నుండి భారత్‌కు వచ్చిన ప్రయాణికులు.. జిల్లా నిఘా అధికారులను సంప్రదించాలని కేంద్రం సూచించింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి 14 రోజుల ట్రావెల్ హిస్టరీ తీసుకోవాలని కేంద్ర రాష్ట్రాలను కోరింది. అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా నెగిటివ్ వచ్చినా, కొన్ని రోజులు పాటు ఐసోలేషన్ లో ఉండాలని తెలిపింది. ఇక, పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్‌ ఎన్‌ఐవీ పుణెకు పంపాలని రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం కొత్తగా విడుదల చేసిన గైడ్ లైన్స్‌ లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. (New Covid 19 Strain Symptoms)