డిగ్రీ, పీజీ కాలేజీల ప్రారంభంపై యూజీసీ ప్రకటన, సెలవులు కట్

కరోనా కాటుతో మూసివేయబడిన డిగ్రీ, పీజీ కళాశాలల పున:ప్రారంభంమై ఒక క్లారిటీ వచ్చింది. కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను యూజీసీ మంగళవారం అనౌన్స్ చేసింది.

డిగ్రీ, పీజీ కాలేజీల ప్రారంభంపై యూజీసీ ప్రకటన, సెలవులు కట్

Updated on: Sep 23, 2020 | 12:44 PM

కరోనా కాటుతో మూసివేయబడిన డిగ్రీ, పీజీ కళాశాలల పున:ప్రారంభంమై ఒక క్లారిటీ వచ్చింది. కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను యూజీసీ మంగళవారం అనౌన్స్ చేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి క్లాసెస్ స్టార్ చెయ్యాలని యూనివర్సిటీలకు సూచించింది. కాలేజీలు, యూనివర్శిటీలకు  కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ను యూజీసీ రిలీజ్ చేసింది. దీని ప్రకారం 2020-21 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ ఫస్ట్ ఇయర్ తరగతులు నవంబర్‌ 1 నుంచి స్టార్టవ్వనున్నాయి. అక్టోబరు చివరి నాటికి అడ్మిషన్స్ ప్రక్రియను కంప్లీట్ చేసి నవంబరు నుంచి యూజీ, పీజీ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభించాలని యూజీసీ అన్ని యూనివర్శిటీలను ఆదేశించింది. శీతాకాల, వేసవి సెలవుల్లో కోతలు విధించాలని  సూచించింది.  ఈ ఏడాది విద్యార్థులు సకాలంలో డిగ్రీ పట్టా పొందేలా వచ్చే ఏడాది విద్యా సంవత్సరాన్ని త్వరగా ప్రారంభించాలని చెప్పింది.

ఇక వారానికి ఆరు రోజులు పాఠాలు బోధించడం ద్వారా నష్టపోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయొచ్చని యూజీసీ పేర్కొంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి తొలి రెండు సెమిస్టర్ల పరీక్ష తేదీలను ఇప్పటికే యూజీసీ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ అన్ని యూనివర్శిటీల పరిధుల్లోని డిగ్రీ, పీజీ ఫస్ట్ ఇయర్ తరగతులను యూజీసీ షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. దీనిపై త్వరలో అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి వివరించారు.

Also Read :

Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?

సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం !

Loading...
Unable to load recommendations.
Follow Us