కారు బాంబు కేసు దర్యాప్తును ఎన్ఐఎ తీసుకోవడం అనుమానాస్పదం, మహారాష్ట్ర సీఎం థాక్రే
ఇటీవల పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న వాహనం తాలూకు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించడం అనుమానాస్పదంగా...
ఇటీవల పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న వాహనం తాలూకు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించడం అనుమానాస్పదంగా ఉందని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే అన్నారు. ఈ ఘటనలో ఈ కేసు దర్యాప్తును తమ ప్రభుత్వం యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విభాగానికి అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు కేంద్ర హోం శాఖ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ బాధ్యతను ఎన్ఐఏకు అప్పగించడమేమిటని, ఇది అనుమానాస్పదంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రభుత్వాలు వస్తూ, పోతూ ఉంటాయని, కానీ అధికార యంత్రాంగమన్నది ఉంటుందని, దాన్ని నమ్మవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.. కాగా ఈ కేసును ఎన్ఐఎ మళ్ళీ కొత్తగా నమోదు చేసిందని హోం శాఖకు చెందిన ఓ ప్రతినిధి కూడా చెప్పారు.
ఈ కేసులో ఆ వాహనానికి చెందిన మాన్ సుఖ్ హీరన్ అనే వ్యక్తి మృతి విషయాన్ని థాక్రే ప్రస్తావించారు. ఇంత ప్రాముఖ్యత గల కేసు దర్యాప్తునును మేము ఏటీఎస్ కు అప్పగిస్తే అది చెల్లదన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. విపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల విశ్వాసం లేదని, అందుకే ఈ సర్కార్ పని చేయడంలేదని చూపగోరుతోందని ఆయన విమర్శించారు . అలాంటప్పుడు పెట్రోలియం ఉత్పత్తులపైన రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని ఎందుకు కోరుతోందని కూడా ఆయన ప్రశ్నించారు. కాగా ఈ కేసు విషయంలో మహారాష్ట్ర సీఎం ఉధ్దవ్ థాక్రే ఇంత బేలగా మాట్లాడడం ఇదే మొదటిసారి. తమ సర్కార్ ని కేంద్రం గుర్తించడం లేదా అన్న తరహాలో ఆయన మాట్లాడారు. నిజానికి మాన్ సుఖ్ హీరన్ మృతిలో అనుమానాస్పద అంశాలేవీ లేవని పోలీసులు స్పష్టం చేశారు కూడా.
మరిన్ని చదవండి ఇక్కడ :