తెలుగు రచయితలకు సాహిత్య అవార్డులు

2019వ సంవత్సరానికి యువ పురస్కార్, బాల సాహిత్య పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. యువ పురస్కారం రచయిత గడ్డం మోహనరావుకు, బాల సాహిత్య పురస్కారం బెలగం భీమేశ్వరరావుకు దక్కింది. దేశంలో మొత్తం 23 భాషలకు యువ పురస్కార్ ప్రకటించారు. అందులో 11 పుస్తకాలు కవిత్వం, ఆరు చిన్న కథలు, ఐదు నవలలు, ఒకటి సాహిత్య విమర్శ 2019 సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌లను సొంతం చేసుకున్నాయి. ఇక రచయిత వయస్సు జనవరి ఒకటి నాటికి 35 […]

తెలుగు రచయితలకు సాహిత్య అవార్డులు

Updated on: Jun 15, 2019 | 11:42 AM

2019వ సంవత్సరానికి యువ పురస్కార్, బాల సాహిత్య పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. యువ పురస్కారం రచయిత గడ్డం మోహనరావుకు, బాల సాహిత్య పురస్కారం బెలగం భీమేశ్వరరావుకు దక్కింది. దేశంలో మొత్తం 23 భాషలకు యువ పురస్కార్ ప్రకటించారు. అందులో 11 పుస్తకాలు కవిత్వం, ఆరు చిన్న కథలు, ఐదు నవలలు, ఒకటి సాహిత్య విమర్శ 2019 సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌లను సొంతం చేసుకున్నాయి. ఇక రచయిత వయస్సు జనవరి ఒకటి నాటికి 35 యేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిని పరిగణలోకి తీసుకున్నారు. మోహనరావు రచించిన కొంగవాలు కత్తి నవలకు సాహిత్య పురస్కారం లభించింది. తాత మాట వరాల మూట అనే నవలను రచించిన బెలగం భీమేశ్వరరావుకు బాల సాహిత్య పురస్కారం దక్కింది.