
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని పచ్చని పంటపొలాల్లో ఆడమగ పాముల సయ్యాట టీవీ9 కెమెరాకి చిక్కింది. దాదాపు అరగంటపాటు క్రతువు నిర్వహించుకున్న గవ్వపెంజర జాతి పాముల రసక్రీడ ఆద్యంతం కెమెరాలో పదిలమైంది. అమీర్ పేట గ్రామశివారులోని పంటపొలాల్లో ఈ అరుదైన ఘట్టం కనిపించింది. సూర్యుడు ఉదయిస్తున్న వేళ పచ్చటి పంటపొలాల్లో ఈ పాముల నాట్యాన్ని అక్కడ పనిచేస్తున్న రైతులు సైతం తిలకించారు.