‘వైఎస్‌ఆర్ చేయూత’తో కలిసి వచ్చిన మరో రెండు దిగ్గజ కంపెనీలు
వైఎస్‌ఆర్ చేయూత పథకంలో భాగంగా మరో రెండు దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. రియలయన్స్ రిటైల్ - జియోతోపాటు అల్లాన కంపెనీలు అవగాహన ఒప్పందం..
వైఎస్‌ఆర్ చేయూత పథకంలో భాగంగా మరో రెండు దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. రియలయన్స్ రిటైల్ – జియోతోపాటు అల్లాన కంపెనీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం మహిళలకు వ్యాపార అవకాశాలను ఆయా కంపెనీలు కల్పిస్తాయి. సీఎం సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు ఆయా కంపెనీల ప్రతినిధులు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటికే 45 – 60 ఏళ్ల మధ్యనున్న మహిళలకు చేయూత ద్వారా సాయం చేస్తున్నామన్నారు. వచ్చే నెల ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. మొత్తంగా దాదాపు కోటి మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని, వారికి వ్యాపార అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే సాయం… వారి జీవితాలను మార్చేదిగా ఉండాలని సూచించారు. ఆ దిశగా సహకారాన్ని అందించాలని కంపెనీలను కోరారు సీఎం జగన్.