బాలీవుడ్‌కు నాని ‘వి’ సినిమా..!
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా 'వి'. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
V Hindi remake: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా ‘వి’. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. నివేధా థామస్, అదితీ రావు హైదరీ హీరోయిన్‌లుగా నటించారు. నానికి ఇది 25వ సినిమా కాగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో ఇది మూడో సినిమా. ఇప్పటికే టీజర్, రెండు పాటలతో ఆకట్టుకున్న ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడట. ప్రస్తుతం దిల్ రాజు పలువురు బాలీవుడ్ బడా నిర్మాతలతో ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్నెల కిషోర్, జగపతి బాబు, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా.. అమిత్ త్రివేది సంగీతం అందించారు.
Also Read:
కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..