దారుణం: ఆడుకుంటూ నాలుగో అంతస్తు నుంచి పడిపోయిన బాలుడు

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. పాతబస్తీలోని ఓ ఇంటి దాబాపై ఆడుకుంటున్న రెండేళ్ళ బాలుడు దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమే కారణమని కాలనీ వాసలు చెబుతున్నారు.

దారుణం: ఆడుకుంటూ నాలుగో అంతస్తు నుంచి పడిపోయిన బాలుడు

Updated on: Mar 30, 2020 | 11:52 AM

Two years old boy fell down from fourth floor: ఆడుకొంటూ అకస్మాత్తుగా నాలుగవ అంతస్తు నుండి పడి రెండు సంవత్సరాల బాలుడు దుర్మరణం చెందిన దారుణ సంఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాబ్ కుంట ప్రాంతంలో మహమ్మద్ జైన్ అనే రెండేళ్ళ బాలుడు సోమవారం ఉదయం తమ సొంతింటి నాలుగో అంతస్తుపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు.

సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుని మృతదేహాన్ని పోస్టుమార్గానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమే బాలుని మరణానికి కారణమైందని భావిస్తున్నారు.