కరోనా వైరస్ పై పోరులో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఉద్యమించకపోతే సమీప భవిష్యత్తులో 20 లక్షల కోవిడ్ మరణాలు తప్పకపోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఛరించింది. సాధ్యమైనంత త్వరగా సమర్థవంతమైన వ్యాక్సీన్ రావలసి ఉందని ఈ సంస్థ ఎమర్జెన్సీస్ ప్రోగ్రాం హెడ్ మైక్ ర్యాన్ అన్నారు. ఇరవై లక్షల మరణాలు అన్నది ఊహ కాదు, ఇందుకు అవకాశం ఉంది అని ఆయన నొక్కి చెప్పారు. గత తొమ్మిది నెలలుగా కోవిడ్-19 విజృంభిస్తోందన్నారు. టెస్టుల సంఖ్యను మరింత పెంచవలసి ఉందన్నారు. బ్రిటన్ వంటి దేశాల్లో లాక్ డౌన్ ని ఇప్పటికీ వేలాది మంది వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ తగ్గుతుందని ఎలా ఆశిస్తామన్నారు. ఐరాస వంటి సంస్థలు ఇప్పటికైనా చొరవ తీసుకుని ఈ మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు.