జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ లోని బడ్గామ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారు. 

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

Edited By:

Updated on: Oct 28, 2020 | 11:52 AM

జమ్మూ కాశ్మీర్ లోని బడ్గామ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారు.  నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గాలింపు జరుపుతున్న  భద్రతాదళాలపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు తెలిసింది. ఉభయ పక్షాల మధ్య సుమారు 4 గంటలపాటు కాల్పులు జరిగాయని, చివరకు ఇద్దరు టెర్రరిస్టుల మృతదేహాలను కనుగొన్నామని సైనికవర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండవచ్చునని భావించిన భద్రతా దళాలు… గాలింపును ఉధృతం చేశాయి.

Follow Us