AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోటి కోడళ్ల పంచాయితీ : ఏపీ, తమిళనాడులోని రెండు గ్రామాల వివాద‌మైంది

తోటి కోడళ్ల మ‌ధ్య చిన్న‌,చిన్న గొడ‌వ‌లు ఉండ‌టం స‌హ‌జం. అవి కాస్త పెద్ద‌వైతే కుటుంబ పెద్ద‌లు క‌లగ‌జేసుకోని చక్క‌దిద్దుతారు.

తోటి కోడళ్ల పంచాయితీ : ఏపీ, తమిళనాడులోని రెండు గ్రామాల వివాద‌మైంది
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2020 | 7:57 AM

Share

తోటి కోడళ్ల మ‌ధ్య చిన్న‌,చిన్న గొడ‌వ‌లు ఉండ‌టం స‌హ‌జం. అవి కాస్త పెద్ద‌వైతే కుటుంబ పెద్ద‌లు క‌లగ‌జేసుకోని చక్క‌దిద్దుతారు. అయితే చిత్తూరు జిల్లాలోని ఈ తోటి కోడ‌ళ్ల గొడవ మాత్రం రెండు రాష్ట్రాల‌లోని గ్రామాల‌కు విస్త‌రించింది. అది కూడా ఇరు గ్రామాల ప్ర‌జలు పోలీస్ స్టేషన్ స‌మీపంలో పంచాయితీ పేరుతో పోట్లాట‌కు దిగారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ప‌లువు‌రురికి గాయాల‌య్యాయి. గొడ‌వ జ‌ర‌గ‌కుండా నిరోధించాల్సిన పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించారు.

వివ‌రాల్లోకి వెళ్తే..ఏపీలోని చిత్తూరు జిల్లా యాదమరి మండలం పచ్చయప్పవూరుకు చెందిన పరమేశ్వరి, హేమలత తోటి కోడళ్లు. వీరి ఇళ్లు పక్క‌ప‌క్క‌నే ఉంటాయి. పొలం కూడా ప‌క్క‌ప‌క్క‌నే. ఈ క్ర‌మంలో తరచూ గొడవలు జ‌రుగుతూ ఉండేవి. అవి కాస్తా పెద్దవి కావడంతో ఇరువురి తల్లిదండ్రులు కలగజేసుకున్నారు. తోటి కోడళ్ల స్వగ్రామాలైన..తమిళనాడు రాష్ట్రంలోని అంకణాపల్లి, పూతలపట్టు మండలం చిన్నబండపల్లి గ్రామాల్లోని.. వారి తరఫు బంధువులు వచ్చారు. శుక్రవారం సాయంత్రం యాదమ పీఎస్ వద్ద‌ పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి అదుపు తప్పిన ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌లో పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి కూత‌వేటు దూరంలో ఉన్న పోలీసులు..అక్క‌డికి వ‌చ్చి ప్రేక్షక పాత్ర పోషించారు. అనంత‌రం గాయాలైన వారిని చికిత్స కోసం చిత్తూరు గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి పంపారు. ఇరువర్గాలపై కేసులు న‌మోద‌య్యాయి.

Also Read : రమేష్‌ ఆస్పత్రికి భారీ షాకిచ్చిన ఏపీ సర్కార్

Follow Us
రామాయణ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన యశ్
రామాయణ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన యశ్
ఓటీటీలో పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు
3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?
3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?
మహాదేవుని త్రిశూలంలోని మూడు కొమ్ముల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక..
మహాదేవుని త్రిశూలంలోని మూడు కొమ్ముల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక..
మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు