శ్రీనగర్‌లో రెండు రోజుల పాటు కర్ప్యూ

|

Aug 03, 2020 | 11:41 PM

శ్రీనగర్‌లో మరోసారి రెండు రోజులపాటు కర్ప్యూ విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దై ఆగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆ రోజును బ్లాక్‌ డేగా పాటించాలని పీడీపీ పిలుపునిచ్చింది. . ఈ నేపథ్యంలో అప్రమత్తమైన హోం శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది.

శ్రీనగర్‌లో రెండు రోజుల పాటు  కర్ప్యూ
Follow us on

శ్రీనగర్‌లో మరోసారి రెండు రోజులపాటు కర్ప్యూ విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దై ఆగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆ రోజును బ్లాక్‌ డేగా పాటించాలని పీడీపీ పిలుపునిచ్చింది. జమ్ముకశ్మీర్‌ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన హోం శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్ముకశ్మీర్‌ వ్యాప్తంగా రెండు రోజులపాటు నిషేధ అంక్షలు విధించింది. సున్నిత ప్రాంతాల్లో అల్లర్లు జరిగేందుకు అవకాశమున్నందున ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. మంగళ, బుధవారాల్లో శ్రీనగర్‌లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. మరోవైపు, కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా అమల్లో ఉన్న నిబంధలను ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించింది. ఎటువంటి ప్రదర్శనలకు అనుమతి లేదని హోం శాఖ అధికారులు వెల్లడించారు.