AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణా జిల్లాలో విషాదం.. ఆడుకుంటూ కారులోకి వెళ్లిన చిన్నారులు.. ఊపిరాడక ఇద్దరు మృతి..

కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు.

కృష్ణా జిల్లాలో విషాదం.. ఆడుకుంటూ కారులోకి వెళ్లిన చిన్నారులు.. ఊపిరాడక ఇద్దరు మృతి..
Balaraju Goud
|

Updated on: Nov 17, 2020 | 7:57 PM

Share

కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఏ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల తండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకునేందుకు ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్న ఇండికా కారులోకి ఐదుగురు చిన్నారులు వెళ్లి కూర్చున్నారు. ఆడుకుంటూ కాసేపటికే మధ్యలో ముగ్గురు పిల్లలు కారు దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత కారు లాక్‌పడటంతో ఇద్దరు పిల్లలు బయటకు రాలేకపోయారు. దీంతో ఇద్దరు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు చిన్నారుల వ‌య‌సు 4 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. దీంతో మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు చిన్నారులు బాణావతు శ్రీనివాస్ రావు, బాణావతు యామనిశ్రీ గా గుర్తించారు. అప్పటి వరకు కళ్లముందు కనిపించిన పిల్లలు విగతజీవులు మారడంతో స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న తిరువూరు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్