
ఆగస్టు 25.. 2007…గ్రేటర్ హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రోజు సాయంత్రం వేళ రెండు నిమిషాల వ్యవధిలో లుంబినీ పార్క్ లేజర్ షో వద్ద.. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద రెండు బాంబులు భారీ శబ్దంతో పేలాయి. ఉగ్రవాదుల మారణ హోమంలో 40 మందిగా పైగా మృత్యువాతపడ్డారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ జంట పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. పేలుళ్ల తర్వాత సిటీలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు…19 బాంబులను గుర్తించి పేలకుండా నిర్వీర్యం చేశారు. పేలుళ్ల వల్ల గాయపడిన కొందరు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఆనాటి భయంకర పరిస్థితులను గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు.
కాగా పేలుళ్లకు పాల్పడిన నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులకు ఎన్ఐఏ కోర్టు దర్యాప్తు అనంతరం శిక్ష ఖరారు చేసింది. కేసులో ఏ-1 గా ఉన్న హానిక్ షఫిక్ సయ్యద్, ఏ-2 మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరి లను దోషిగా తేల్చింది ఎన్ఐఏ కోర్టు. శిక్ష ఖరారు చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల ఇప్పటికీ తీర్పు అమలుకాలేదు. కాగా జంట పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ సంస్థ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మక్కా పేలుళ్ల అనంతరం పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!
పబ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీలతో రెండు కుటుంబాల ఘర్షణ