‘దేశ్ బద్లో’ నినాదమే టీవీ9 భారత్‌వర్ష్ లక్ష్యం: సీఈవో రవి ప్రకాశ్
సమాజంలో మార్పు రావాలన్న అభిప్రాయంతో 15ఏళ్ల క్రితం కొంతమంది యువ జర్నలిస్ట్‌లు టీవీ9 ఛానెల్‌కు అంకురార్పణ చేశారని సీఈవో రవి ప్రకాశ్ అన్నారు. ‘టీవీ9 భారత్ వర్ష్’ పేరుతో హిందీ జర్నలిజంలోకి ప్రవేశించింది టీవీ9 ఛానెల్. దీనికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఈవో రవిప్రకాశ్ మాట్లాడుతూ.. అనేక నిర్ణయాల తరువాత ఇప్పుడు హిందీ జర్నలిజంలోకి టీవీ9 అడుగుపెట్టిందని అన్నారు. ఛానెల్ ఏర్పడిన రోజు నుంచి ఇప్పటివరకు ప్రజల సమస్యలను […]

సమాజంలో మార్పు రావాలన్న అభిప్రాయంతో 15ఏళ్ల క్రితం కొంతమంది యువ జర్నలిస్ట్‌లు టీవీ9 ఛానెల్‌కు అంకురార్పణ చేశారని సీఈవో రవి ప్రకాశ్ అన్నారు. ‘టీవీ9 భారత్ వర్ష్’ పేరుతో హిందీ జర్నలిజంలోకి ప్రవేశించింది టీవీ9 ఛానెల్. దీనికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఈవో రవిప్రకాశ్ మాట్లాడుతూ.. అనేక నిర్ణయాల తరువాత ఇప్పుడు హిందీ జర్నలిజంలోకి టీవీ9 అడుగుపెట్టిందని అన్నారు. ఛానెల్ ఏర్పడిన రోజు నుంచి ఇప్పటివరకు ప్రజల సమస్యలను పరిష్కారం చేసే వైపుగా ప్రభుత్వాలను ప్రోత్సహించడం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకువచ్చేలా టీవీ9 పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఇక జాతీయ స్థాయిలో టీవీ9 ‘దేశ్ బద్లో’ అనే నినాదంతో ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని టీవీ9 భావిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. భారతీయ ఉజ్వల భవిష్యత్ కోసం టీవీ9 పనిచేస్తుందని.. మార్పు కోసమే తాము ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.