రెండేళ్ల పాపను కబళించిన బొమ్మ

| Edited By:

May 10, 2019 | 4:06 PM

టీవీ నటుడు ప్రతీష్ వోరా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. స్టార్ భారత్‌లో ‘ప్యార్ కే పాపడ్’ షోలో నందు గుప్తా పాత్రతో ప్రతీష్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ‘క్రైమ్ పెట్రోల్’, ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ సీరియల్స్‌లో కూడా నటించాడు. గురువారం రాత్రి అతని రెండేళ్ల కుమార్తె ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటూ దాన్ని నోట్లు పెట్టుకుంది. అది గొంతులో చిక్కుకోవడంతో చనిపోయింది. ఈ సమాచారం తెలియగానే ప్రతీష్ కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి భౌతిక కాయానికి శుక్రవారం […]

రెండేళ్ల పాపను కబళించిన బొమ్మ
Follow us on

టీవీ నటుడు ప్రతీష్ వోరా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. స్టార్ భారత్‌లో ‘ప్యార్ కే పాపడ్’ షోలో నందు గుప్తా పాత్రతో ప్రతీష్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ‘క్రైమ్ పెట్రోల్’, ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ సీరియల్స్‌లో కూడా నటించాడు. గురువారం రాత్రి అతని రెండేళ్ల కుమార్తె ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటూ దాన్ని నోట్లు పెట్టుకుంది. అది గొంతులో చిక్కుకోవడంతో చనిపోయింది. ఈ సమాచారం తెలియగానే ప్రతీష్ కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి భౌతిక కాయానికి శుక్రవారం అత్యక్రియలు నిర్వహించనున్నారు. చిన్నారులు ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుతున్నప్పుడు పెద్దలు తప్పకుండా పర్యవేక్షించాలి.