వెంకన్న దర్శనం షురూ.. ట్రయిల్ దర్శన్ విజయవంతం..

|

Jun 08, 2020 | 11:29 AM

ఏపీలోని ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు తిరిగి తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి ఇవాళ్టి నుంచి టీటీడీ ఉద్యోగులతో మొదలైన ట్రయిల్ రన్ విజయవంతం అయిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు...

వెంకన్న దర్శనం షురూ.. ట్రయిల్ దర్శన్ విజయవంతం..
Follow us on

సుమారు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత ఏపీలోని ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు తిరిగి తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వం సిద్దం కాగా.. ఇవాళ్టి నుంచి టీటీడీ ఉద్యోగులతో మొదలైన ట్రయిల్ రన్ విజయవంతం అయిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గంటకు 500 మంది భక్తుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ.. ఎక్కువ మందిని దర్శనానికి పంపించే ఆలోచనలో ఉన్నామని ఆయన అన్నారు. ఇక దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం ఇచ్చే అంశంపై ప్రస్తుతం కేంద్రంతో మాట్లాడుతున్నామన్నారు. అలాగే సర్వే దర్శనాలను కూడా.. ఆన్ లైన్లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు.

భౌతిక దూరం పాటించే క్రమంలో క్యూలైన్లలో జిగ్ జాగ్ సిస్టం బాగా పనిచేస్తోందని తెలిపారు. పదేళ్లలోపు పిల్లలను, 65 ఏళ్లు పైబడిన వృద్దులను కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమన్నారు. కాగా, తిరుమలపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు పెడతామని వైవీ సుబ్బారెడ్డి మరోసారి హెచ్చరించారు. సప్తగిరి పత్రికలో కుసుడి కథనం వెనుక ఖచ్చితంగా కుట్ర కోణం ఉందన్న ఆయన.. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశామన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతిరోజు ఏడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు దర్శనానికి అనుమతించనున్నట్టు టీటీడీ వెల్లడించింది.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

కేంద్రం సంచలనం.. మహిళల వివాహ వయసు పెంపు?

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..